Nandikotkur: నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ విజయం!

Nandikotkur: నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, డాక్టర్ సుధీర్ దారా ధన్యవాదాలు తెలిపారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 4 Nov 2026 2:20 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ విజయం!

Nandikotkur: నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన పట్టణ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ,సమన్వయకర్త డాక్టర్ సుదీర్ దారా పేరు పేరునా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ దారా సుధీర్ మాట్లాడుతూ నందికొట్కూరు ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు చెంపపెట్టు అని, ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అనంతరం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్ కు ఎగనామం, సంక్షేమ పథకాలు అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. కేసీ కెనాల్ కు నీరు ఇవ్వండి అంటే ఫ్యాక్టరీలకు నీరు తరలిస్తున్నారని...బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు, రాయలసీమలో నీరు లేక పంటలు ఎండిపోయినా చంద్రబాబు పట్టించుకోలేదు

ప్రశాంతంగా, ఎంతో ఉత్సాహంగా ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన యువతకు, పెద్దలకు, మహిళలకు వందనం, అంటూ ఈ విజయం మా ఒక్కరిది కాదు, నందికొట్కూరు అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరిది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం - నందికొట్కూరు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)