Yemmiganur: ఎమ్మిగనూరులో భారీ వర్షం బురదమయంగా మారిన పశువుల సంత!

Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కురిసిన భారీ వర్షానికి పశువుల మార్కెట్ పూర్తిగా బురదమయంగా మారింది.

S Khaleel, Yemmiganur
Published on: 14 Jun 2026 2:11 PM IST
Yemmiganur
X

Yemmiganur: ఎమ్మిగనూరులో భారీ వర్షం బురదమయంగా మారిన పశువుల సంత!

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాత్రి నుండి కురిసిన భారీ వర్షం కారణంగా పశువుల మార్కెట్ పూర్తిగా బురద మయంగా మారింది.

మార్కెట్ ప్రాంగణం అంతా తడిగా మారడంతో పశువులు విక్రయానికి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దింతో రైతులు రోడ్డు పైనే పశువులను నిలబెట్టి విక్రయాలు కొనసాగిస్తున్నారు.

రోడ్డు పైకి పశువులు రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి ఆదివారం ఇక్కడ పశువుల సంత జరుగుతోంది.చుట్టుపక్కల గ్రామాల నుండి కనీసం 500 లకు పైగా పశువులు విక్రయని వస్తాయి.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story