Kurnool: కర్నూలులో అన్న క్యాంటీన్లలో అల్పాహారం చేసిన కమిషనర్

Kurnool: కర్నూలు కమిషనర్ చల్లా ఓబులేసు అన్న క్యాంటీన్లను తనిఖీ చేసి స్వయంగా అల్పాహారం చేసి నాణ్యతపై ఆరా తీశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 April 2026 11:15 AM IST
Kurnool
X

 Kurnool

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్న క్యాంటీన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సేవల నాణ్యతను పరిశీలించారు. బుధవారం ఉదయం కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అన్న క్యాంటీన్, ముజఫర్ నగర్ రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు.

పారిశుద్ధ్య తనిఖీల అనంతరం ముజఫర్ నగర్ రోడ్డులోని అన్న క్యాంటీన్లో కమిషనర్ స్వయంగా టోకెన్ తీసుకుని అల్పాహారం చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడి టిఫిన్ నాణ్యత, సిబ్బంది ప్రవర్తనపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘుతో కలిసి అల్పాహారం చేసి రుచిపై ఆరా తీశారు. క్యాంటీన్ల పరిసరాల్లో పరిశుభ్రతను పరిశీలించి తాగునీటిని శుభ్రమైన ప్రదేశాల్లో ఉంచాలని, డస్ట్‌బిన్‌లను ప్రతిరోజూ శుభ్రం చేయాలని సూచించారు.

అన్న క్యాంటీన్లలో భోజనం చేసే ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందేలా నాణ్యత, పారిశుద్ధ్య ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు రమేష్, లోకేష్, ఎంజల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story