Kurnool: రాయలసీమ సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 14న ఛలో ఢిల్లీ!
Kurnool: రాయలసీమ సమస్యల పరిష్కారం, బీజేపీ డిక్లరేషన్ అమలు కోరుతూ డిసెంబర్ 14న ఛలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్లు ఆర్వీపీఎస్, ఆర్హెచ్పీఎస్ నేతలు ప్రకటించారు.
Kurnool: రాయలసీమ సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 14న ఛలో ఢిల్లీ!
కర్నూలు: కర్నూలు వేదికగా బిజెపి ఇచ్చిన రాయలసీమ డిక్లరేషన్ ను అమలు చేయాలని,రాయలసీమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాయలసీమ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 14న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మదాసి కురువ సంకన్న తెలిపారు.
కర్నూలు నగరంలోని స్థానిక బిర్లా కాంపౌండ్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ బిజెపి ఇచ్చిన రాయలసీమ డిక్లరేషన్ అమలు చేయాలని, రాయలసీమకు త్రాగునీరు, సాగునీరు అందించే గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని, కడపలో ఉక్కు పరిశ్రమ, గుంతకల్లులో రైల్వే జోన్, కర్నూలు, చిత్తూరులో ఐటి హబ్ లను ఏర్పాటు చేయాలని, ఎల్ నీనో ప్రభావంతో రాయలసీమలో వ్యవసాయంలో నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం లక్ష రూపాయలు తక్షణ సాయం కింద ఇవ్వాలనారు.
కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకు రాయలసీమకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని,కృష్ణనది యాజమాన్య బోర్డు రాయలసీమలో ఏర్పాటు చేయాలని,సంగమేశ్వరం వద్ద తీగల వంతెనకు బదులుగా బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని,కరువు వలసలతో రాయలసీమ విద్యార్థులు విద్యకు దూరమవుతున్న విషయాన్ని గుర్తించి కర్నూల్ లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాయలసీమ పేరుతో ఆధునిక విద్య,సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధన,వ్యవసాయం,నీటి వనరుల నిర్వహణ,కృతిమ మేధస్సు,వైద్యం,నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు ప్రాధాన్యమిచ్చే ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఇలాంటి పలు డిమాండ్లతో డిసెంబర్ 14న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మదాసికురువ భరత్ కుమార్, రమేష్ కుమార్, నాగరాజు, సురేంద్ర, వెంకటేష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.




