Giddalur: గిద్దలూరు స్ప్రింగ్ బోర్డు పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు స్ప్రింగ్ బోర్డు పాఠశాలలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 14 Nov 2026 4:15 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు స్ప్రింగ్ బోర్డు పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం!

మార్కాపురం జిల్లా: గిద్దలూరు, పట్టణంలోని స్ప్రింగ్ బోర్డు ప్రైవేటు పాఠశాలలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, బాలల దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేసే ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.

బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ జే.వి. నారాయణ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి భారతదేశ భవిష్యత్తు అని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, సేవాభావం, నైతిక విలువలను అలవరచుకోవాలని సూచించారు.

పాఠశాల డైరెక్టర్ మణి చైతన్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి చిన్నారిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిరంతర సాధనతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు. అపజయాలకు భయపడకుండా వాటిని విజయానికి సోపానాలుగా మార్చుకోవాలని, పెద్ద కలలు కని వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులందరికీ మిఠాయిలను పంపిణీ చేశారు. చిన్నారుల ఆటపాటలు, నవ్వులు, కేరింతలతో పాఠశాల ప్రాంగణమంతా సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జాడి శ్వేత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU