Dhone: డోన్‌లో ఖాళీ బిందెలతో మహిళల వినూత్న నిరసన!
Dhone: నంద్యాల జిల్లా డోన్ ఎంపీడీవో ఆఫీస్ వద్ద చింతలపేట మహిళల నిరసన.. 4 నెలలుగా తాగునీటి ఎద్దడి, ఖాళీ బిందెలతో వినూత్నంగా ఆందోళన.
Dhone: డోన్‌లో ఖాళీ బిందెలతో మహిళల వినూత్న నిరసన!
Dhone: నంద్యాల జిల్లా డోన్ మండలం చింతలపేట గ్రామంలో నాలుగు నెలలుగా నీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామ మహిళలు ఆందోళన చేపట్టారు. గ్రామం నుంచి ట్రాక్టర్లలో ఖాళీ బిందెలతో తరలివచ్చిన మహిళలు డోన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట వినూత్నంగా నిరసన తెలిపారు.
నీటి సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటితో పాటు రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కొందరు అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని మహిళలు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్య వసతులు కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.




