Pattikonda: సీఐ జయన్నను వెంటనే సస్పెండ్ చేయాలి: అఖిలపక్షం!
Pattikonda: అర్బన్ సీఐ జయన్నను వెంటనే సస్పెండ్ చేయాలని అఖిలపక్ష నేతలు, జర్నలిస్టు జేఏసీ డిమాండ్ చేశాయి. విలేకరిపై సీఐ దాడికి నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
Pattikonda: సీఐ జయన్నను వెంటనే సస్పెండ్ చేయాలి: అఖిలపక్షం!
పత్తికొండ: పత్తికొండ అర్బన్ సీఐ జయన్నను సస్పెండ్ చేయాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, వైసిపి మండల కన్వీనర్ కారం నాగరాజు,సిపిఎం సీనియర్ నాయకులు రంగారెడ్డి,లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆనందాచారి,బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు,బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు డిమాండ్ చేశారు.
ఆదివారం స్థానిక కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జర్నలిస్టు జేఏసీ నాయకులు ఎం.సాల్ రంగడు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తికొండ పోలీస్ స్టేషన్ ఆవరణంలో విశాలాంధ్ర విలేఖరి ఎం.నాగరాజు వార్తా సేకరణ కోసం వెళితే అర్బన్ సీఐ.జయన్న నాగరాజు పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మెడ పట్టి గెంటడమే కాకుండా,పరుష పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు.
జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ,సమాజంలో జరిగే మంచి చెడులను ప్రజలకు పత్రికల రూపంలో తెలియజేస్తారని,అలాంటి వారి పట్ల సీఐ జయన్న వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమన్నారు.జిల్లా పోలీసు అధికారులు జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి సీఐ.జయన్న పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐ.జయన్నను సస్పెండ్ చేసేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు జేఏసీ నాయకులు ఎం.రంగన్న,ఓబులేసు,లక్ష్మీనారాయణ, పక్కీరప్ప,హనుమంతు,మల్లికార్జున,సురేష్,మంజునాథ్,షేక్షా,రాజగోపాల్,షఫీ,నరేష్, మనోహర్,శివ శంకర్,రామాంజనేయలు. రమేషు,నాగరాజు,బద్రీనాథ్,రాజు, రామాంజనేయులు,నాగరాజు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి.రాజా సాహెబ్,జిల్లా సమితి సభ్యులు కారన్న,మండల కార్యదర్శి కారుమంచి,పట్టణ కార్యదర్శి రామాంజనేయులు,సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర,బిజెపి ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆవుల సోమన్న,లోక్ సత్తా పార్టీ నాయకులు జయరాముడు,బి వి ఐ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులు,ఏవి.నాయుడు,వై.రమేష్ తదితరులు పాల్గొన్నారు.




