Markapuram: సుందరయ్య కాలనీలో శిథిలావస్థకు చేరిన పాఠశాల!
Markapuram: మౌలిక సదుపాయాలు కల్పించాలని, శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
Markapuram: సుందరయ్య కాలనీలో శిథిలావస్థకు చేరిన పాఠశాల!
మార్కాపురం: మార్కాపురం జిల్లా సుందరయ్య కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నారుల చదువు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా, నూతన భవనం నిర్మాణంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు.
జిల్లా కలెక్టర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని వారు పేర్కొన్నారు. వెంటనే నూతన పాఠశాల భవనం నిర్మించి, కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రఫీ, విద్యార్థులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




