Kurnool: చంద్రబాబు పర్యటనకు కర్నూలు పోలీసుల పకడ్బందీ బందోబస్తు

Kurnool: ఈ నెల 25న కర్నూలు జిల్లా ఆస్పరిలో జరగనున్న "సంజీవని" కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 19 July 2026 8:00 AM IST
Kurnool
X

Kurnool: చంద్రబాబు పర్యటనకు కర్నూలు పోలీసుల పకడ్బందీ బందోబస్తు

కర్నూలు: ఈ నెల 25వ తేదీన ఆస్పరి మండల కేంద్రంలో నిర్వహించనున్న "సంజీవని" కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆస్పరిలో భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా హెలిప్యాడ్, బహిరంగ సభా ప్రాంగణం, వీఐపీ రాకపోకల మార్గాలు, రూట్ మ్యాప్, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

అలాగే సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాల వద్ద అవసరమైన పోలీసు బందోబస్తు, భద్రతా చర్యలతో పాటు ముఖ్యమంత్రి రాకపోకలకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసూదన్ రావు, ఆస్పరి సీఐ శ్రీనివాస్ నాయక్ , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story