Banaganapalli: సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం.. ఎస్పీ సునీల్ షొరాణ్!
Banaganapalli: బనగానపల్లిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం.
Banaganapalli: సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం.. ఎస్పీ సునీల్ షొరాణ్!
Banaganapalli: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి - మీ హక్కు" కార్యక్రమం పోలీసు బందోబస్తు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ అభినందించారు.
నంద్యాల జిల్లా బనగానపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసింది. పర్యటన మొత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగియడంతో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా పోలీసు శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల బందోబస్తు ఏర్పాట్లు విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. పర్యటన విజయవంతం కావడంలో పోలీసు అధికారులు, సిబ్బంది చూపిన క్రమశిక్షణ, అంకితభావం, సమిష్టి కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
బందోబస్తు విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన ఎస్పీ సునీల్ షొరాణ్... భవిష్యత్తులో కూడా ఇదే సేవాభావం, అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.




