Kurnool: అనాథ పిల్లలు, రోగుల మధ్య బాబు జన్మదిన సంబరాలు
Kurnool: కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Kurnool: అనాథ పిల్లలు, రోగుల మధ్య బాబు జన్మదిన సంబరాలు
Kurnool: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు.. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు టి ఆర్ చౌదరి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 2 వేల మందికి పైగా రైతులు,కూలీలు లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి లో సుశ్రుత వార్డులో రోగులకు దుప్పట్లు ప్లేట్లు స్టీల్ గ్లాసు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బిటి నాయుడు,టిడిపి నాయకుడు పి ఆర్ చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అజ్మత్ బీ,.టీడీపీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, టీడీపీ నగర అధ్యక్షుడు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు.
ఎన్నికల సమయంలో హామీలన్ని సూపర్ సిక్స్ ద్వారా నెరవేర్చారన్నారు. రైతులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు ఎన్నో పథకాలు చేపట్టారన్నారు. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతో సాధ్యమని వారు పేర్కొన్నారు. అనంతరం పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేసి. అనాథ పిల్లలకు స్వీట్లు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.




