Veligonda: వెలిగొండ నిర్వాసితులకు తీపి కబురు రూ.250 కోట్ల పరిహారం విడుదల

Veligonda: వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ.250 కోట్ల పరిహారం చెక్కును అందజేసిన సీఎం చంద్రబాబు. ఇప్పటివరకు మొత్తం రూ.768 కోట్లు అందించిన ప్రభుత్వం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 22 Aug 2026 12:03 PM IST
Veligonda
X

Veligonda: వెలిగొండ నిర్వాసితులకు తీపి కబురు రూ.250 కోట్ల పరిహారం విడుదల

Veligonda: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ పరిహారాన్ని అందించింది. శనివారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు.

వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లను కోల్పోయిన కుటుంబాలకు అండగా ప్రభుత్వం పరిహారం చెల్లింపులను కొనసాగిస్తోంది. తాజాగా అందించిన రూ.250 కోట్లతో కలిపి ఇప్పటి వరకు వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు మొత్తం రూ.768 కోట్ల పరిహారం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

నిర్వాసితుల పునరావాసం, పునరావాస ప్యాకేజీల చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story