Markapuram: సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ విజయ సునీత!
Markapuram: శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును వేగవంతం చేసిన మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతను సత్కరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.
Markapuram: సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ విజయ సునీత!
Markapuram: శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేలా కృషి చేసిన అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. ఇందులో భాగంగా మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందజేశారు.
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, అధికారుల బృందంతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు పనులు, ముంపు గ్రామాలు, నిర్వాసిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు, పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, పెండింగ్ జాబితాల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించారు.
మహిళా కలెక్టర్‌గా స్వయంగా వెలిగొండ టన్నెల్‌లోకి వెళ్లి పనులను పరిశీలించి, ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులను సమన్వయం చేయడంలో విజయ సునీత కీలక పాత్ర పోషించారు.
కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పరిమిత సౌకర్యాలు, సిబ్బంది ఉన్నప్పటికీ.. జేసీ పులి శ్రీనివాసులు, జిల్లా అధికారులు, సిబ్బంది సహకారంతో ప్రాజెక్టు కోసం సమష్టిగా పనిచేశామని కలెక్టర్ తెలిపారు.




