Pedda Dornala: కోలాహలంగా పెద్ద దోర్నాల కూటమి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్!
Pedda Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఇరకసాని దేవయ్య భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
Pedda Dornala: కోలాహలంగా పెద్ద దోర్నాల కూటమి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్!
మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఇరకసాని దేవయ్య నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ కార్యాలయం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి తరలివచ్చారు.
పార్టీ శ్రేణుల నినాదాలు, కార్యకర్తల ఉత్సాహం మధ్య ఇరకసాని దేవయ్య పెద్ద దోర్నాల పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా సాగింది.
ఈ నామినేషన్ ప్రక్రియలో పెద్ద దోర్నాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ షేక్ మాబు, జెడి లక్ష్మయ్య, బట్టు రమణారెడ్డి, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




