Kurnool: ‘యోగాంధ్ర’ హడావుడి.. కలెక్టర్ సమక్షంలో గంజాయి, డ్రగ్స్‌పై ప్రతిజ్ఞ!

Kurnool: కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆధ్వర్యంలో జరిగిన 'యోగాంధ్ర' వేడుకల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై సెట్కుర్ సీఈవో వేణుగోపాల్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 18 Jun 2026 4:02 PM IST
Kurnool
X

Kurnool: ‘యోగాంధ్ర’ హడావుడి.. కలెక్టర్ సమక్షంలో గంజాయి, డ్రగ్స్‌పై ప్రతిజ్ఞ!

కర్నూలు: ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని , మత్తు పదార్థాల సేవనం రవాణా అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధిమాటిక్ యోగ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెట్కుర్ సీఈవో వేణుగోపాల్ ప్రతిజ్ఞ చేయించారు.

యోగ ఆంధ్ర కార్యక్రమంలో ఈగల్ టీం వారు మత్తు పదార్థాలు గుట్కా , గాంజా , హఫీమ్, ఎం డి ఎం మరియు ఇతర కెమికల్స్ ను ఎవరు వాడరాదని , ఎవరు రవాణా చేయకూడదని , మత్తు పదార్థాలకు ఎవరు బానిస కారాదని అన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలి , తెలియజేయాలి అన్న ఉద్దేశంతో యోగ కొరకు సమావేశమైన అందరి చేత జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆధ్వర్యంలో సెట్కూర్ సి ఈ ఓ వేణుగోపాల్ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ ప్రతిజ్ఞ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ , పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత , మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు , రీజనల్ టూరిజం అధికారి లక్ష్మీనారాయణ , మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రఘు , సెట్కూర్ సి ఈ ఓ వేణుగోపాల్, ఎస్ ఏ పి క్యాంపు డి ఎస్ పి మహబూబ్ బాషా , ఆయుష్ జిల్లా యోగా నోడల్ అధికారి డాక్టర్ అమర్నాథ్ ,ఆయుష్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసాద్ , యోగ రాష్ట్ర సెక్రటరీ అవినాష్ , కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులు మొదలగువారు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story