Kurnool: రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్!
Kurnool: రీ సర్వే పనులను వేగవంతం చేసేందుకు విలేజ్ సర్వేయర్లకు ఒక్కోటి రూ. 1.53 లక్షల విలువైన 28 హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పంపిణీ చేశారు.
Kurnool: రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్!
కర్నూలు: ప్రభుత్వం అందజేస్తున్న లాప్ టాప్ లను పూర్తిగా సద్వినియోగం చేసుకొని రీ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ల్యాప్ టాప్ ల పంపిణీ సందర్భంగా విలేజ్ సర్వేయర్ లను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సర్వే డిపార్ట్మెంట్ నుండి సరఫరా చేయబడిన 28 హెచ్.పి కంపెనీ ల్యాప్టాప్ లను ( ఒకటి రూ1,53,000 విలువ గలిగినది ) జిల్లా కలెక్టర్ విలేజ్ సర్వేయర్లకు సర్వే నిమిత్తం వినియోగించుకోవడానికి పంపిణి చేశారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ... సర్వే నిమిత్తం అందజేయబడిన ఈ ల్యాప్టాప్ లను జాగ్రత్తగా పూర్తిగా సద్వినియోగం చేసుకొని సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే నిమిత్తం ప్రజలకు ముందుగా నోటీసులు ఇచ్చి వారిని పిలిపించుకొని వారి సమక్షంలో సర్వే నిర్వహించాలని ఆదేశించారు.ఈ పంపిణీ కార్యక్రమంలో సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ , అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ , మండల సర్వేయర్లు మరియు విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు.




