Kurnool: భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కర్నూలు కలెక్టర్!

Kurnool: ర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 'ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు' కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 7 Aug 2026 6:47 PM IST
Kurnool
X

Kurnool: భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కర్నూలు కలెక్టర్!

కర్నూలు: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు" కార్యక్రమం నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.

శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజల నుంచి భూ సమస్యలు, 22-ఏ నిషేధిత జాబితా, రీ-సర్వే అనంతరం తలెత్తిన వివాదాలు, ఇనాం భూముల నమోదు, పట్టా భూముల సమస్యలు, భూ విస్తీర్ణ వ్యత్యాసాలు, గృహాల మంజూరు, సంక్షేమ పథకాల అమలు, పింఛన్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వ్యవసాయం, రెవెన్యూ, సామాజిక భద్రత తదితర అంశాలకు సంబంధించిన వినతులు వచ్చాయి.. ప్రతి అర్జీని నిర్లక్ష్యం చేయకుండా క్షుణ్ణంగా పరిశీలించి, సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, సమయపాలనతో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు వచ్చే వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ,సర్వే శాఖకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సర్వే నిర్వహించు సమయంలో చుట్టుప్రక్కల ఉన్న రైతులందరినీ నోటీసులు ఇచ్చి అందర్నీ పిలిపించుకొని సర్వే నిర్వహించాలని సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆర్డీవో అరుణ దేవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఎస్ఈ ఆర్ అండ్ బి మహేశ్వర్ రెడ్డి,డిఆర్డిఏ పిడి శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ ఐసిడిఎస్ పిడి విజయ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story