Kurnool: ప్రపంచ స్కార్ఫ్ దినోత్సవం స్కౌటింగ్ సేవాభావానికి వేదిక!

Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో ప్రపంచ స్కార్ఫ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 Aug 2026 12:29 PM IST
Kurnool
X

Kurnool: ప్రపంచ స్కార్ఫ్ దినోత్సవం స్కౌటింగ్ సేవాభావానికి వేదిక!

Kurnool: సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలకు స్కౌటింగ్ ఉద్యమం వేదిక అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.

శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రపంచ స్కార్ఫ్ దినోత్సవం (World Scarf Day) సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించే గొప్ప వేదిక అని కలెక్టర్ పేర్కొన్నారు. స్కౌటింగ్ ఉద్యమ విశిష్టత, విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపుదలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. 1907లో లార్డ్ బాడెన్ పోవెల్ ఇంగ్లాండ్‌లోని బ్రౌన్‌సీ ఐలాండ్‌లో స్కౌటింగ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్కార్ఫ్ డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సమాజ సేవలో స్కౌట్స్, గైడ్స్ ఎల్లప్పుడూ ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారని కలెక్టర్ కొనియాడారు.. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రదానం చేసే రాజ్య పురస్కార్ (గవర్నర్ అవార్డు) సర్టిఫికేట్ పొందిన విద్యార్థులకు ఎంసెట్ (EAPCET)తో పాటు ఉన్నత విద్యా ప్రవేశాల్లో 0.5 శాతం రిజర్వేషన్ కల్పించబడుతుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమంలో డిఈఓ సుధాకర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story