Kurnool: సోలార్ యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయండి: కలెక్టర్ ఏ. సిరి!

Kurnool: జిల్లాలో పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాలపై కలెక్టర్ డా. ఏ. సిరి విద్యుత్ శాఖతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలపై సోలార్ పనుల్లో జాప్యం చేస్తే

V RAMAMOHAN, KURNOOL
Published on: 9 July 2026 4:23 PM IST
Kurnool
X

Kurnool: సోలార్ యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయండి: కలెక్టర్ ఏ. సిరి!

కర్నూలు: పెండింగ్ లో ఉన్న లబ్ధిదారుల గృహాల మీద సోలార్ యూనిట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లో పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి జిల్లాలో మొత్తం 6,882 మంది లబ్ధిదారులను వెండర్లు ఎంపిక చేసుకుని నమోదు చేసుకోగా, ఇప్పటివరకు 3,567 లబ్ధిదారుల గృహాల మీద సోలార్ వ్యవస్థల సంస్థాపనలు పూర్తయ్యాయన్నారు. 1,405 సంస్థాపనలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, మిగిలిన 1,910 మంది లబ్ధిదారుల సంస్థాపనలకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

బ్యాంకుల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల జాబితాను సమర్పించాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రుణాలు సకాలంలో అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

ULA మోడల్ కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ యూనిట్ల పనుల పురోగతికి సంబంధించి, ఈ పనులు చేపడుతున్న ముగ్గురు కాంట్రాక్టర్ల పనితీరును పరిశీలించి, కర్నూలు మరియు ఆదోని ప్రాంతాల్లో పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్ల ప్రతినిధుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నెలాఖరు నాటికి కనీసం 50 శాతం పనులు పూర్తి చేయకపోతే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంతో పాటు, మిగిలిన పనులను ఇతర సంస్థలకు అప్పగించే విధంగా సిఫారసు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

పీఎం కుసుమ్ (PM-KUSUM) పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తికాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (CFA) ప్రభావితమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్‌లోపు అన్ని పనులను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి వేగవంతంగా అమలు చేయాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో ఏపీఎస్పీడిసిఎల్ ఎస్ఈ ప్రదీప్ కుమార్, విద్యుత్ శాఖ ఈఈలు, సోలార్ వెండర్లు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story