Kurnool: మహిళలు, బాలల సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి కలెక్టర్

Kurnool: కర్నూలు జిల్లాలో మహిళలు, బాలల సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులతో సమీక్షించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 4 Aug 2026 5:19 PM IST
Kurnool
X

Kurnool: మహిళలు, బాలల సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి కలెక్టర్

కర్నూలు: మహిళలు, బాలల సంక్షేమానికి సంబంధించిన అన్ని పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ జిల్లా బాలల సంక్షేమ సమితి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిషు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ (MWCD) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU) స్వతంత్రంగా పనిచేయాల్సి ఉందని, ఆ మేరకు వెంటనే ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో కో ఆర్డినేట్ చేసుకొని పని చేయాలని కలెక్టర్ డిసిపిఓ ను ఆదేశించారు.

PM CARES పధకం కింద కేవలం 16 మంది మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించారని, విధులలో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు..జిల్లాలో బాలల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలయ్యేలా అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లాలో అమలవుతున్న బాలల సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని, ఫీల్డ్ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు కేవలం నామమాత్రంగా కాకుండా ఫలితాల ఆధారంగా అమలుకావాలని ఆదేశించారు.

జిల్లా ప్రధాన కేంద్రంతో పాటు అన్ని డివిజన్‌లలో కూడా వీధి బాలలను గుర్తించి రక్షించే ప్రత్యేక డ్రైవ్‌లను ప్రతి నెల నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వీధి బాలలను గుర్తించిన వెంటనే వారికి అవసరమైన సంరక్షణ, పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో ఐసిడిఎస్ పిడి విజయ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ జుబేదాబేగం, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ లు సంజీవ రెడ్డి, వెంకట రమణయ్య, మధు సుధాకర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ అధికారి దివాకర్, అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ హుస్సేన్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story