Kurnool: ప్రతి రోజు 35 వేల మంది కూలీలకు పని కల్పించాలి కలెక్టర్!

Kurnool: వి బి జి రామ్ జీ పథకం కింద ప్రతి రోజు 35 వేల మంది కూలీలకు ఉపాధి కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 Aug 2026 10:41 PM IST
Kurnool
X

Kurnool: ప్రతి రోజు 35 వేల మంది కూలీలకు పని కల్పించాలి కలెక్టర్!

కర్నూలు: వ్యవసాయ పనులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వి బి జి రామ్ జీ పథకం కింద గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

శనివారం వి బి జి రామ్ జీ పథకం అమలుపై ఎంపిడిఓ లు, ఏపీవో లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, ఏపీడి లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు 35 వేల మంది కూలీలకు పని కల్పించాలని,

నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కూలీల హాజరుకు సంబంధించి ఉదయం 6 గంటలకు, 10 గంటలకు NMMS యాప్ లో అటెండెన్స్ తీసుకోవాలన్నారు. అలాగే హార్టికల్చర్ కింద నిర్దేశిత లక్ష్యం మేరకు 5000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ కింద 11 రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ లో చేపడుతున్న ప్లాంటేషన్ కార్యక్రమాలను రెండు మూడు రోజుల్లోపు పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం మండల వారీగా పనుల కల్పన, ప్లాంటేషన్ అంశాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు.

టెలి కాన్ఫరెన్స్ లో డ్వామా పిడి నరసింహారెడ్డి, ఎంపిడిఓ లు , ఏపీవో లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఏపీడి లు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story