Kodumur: కోడుమూరు పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్లు ఏర్పాటు చేయించిన కలెక్టర్!
Kodumur: కోడుమూరు పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల ఇబ్బందులపై hmtv కథనానికి కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి స్పందించి వీల్‌చైర్లు ఏర్పాటు చేయించారు.
Kodumur: కోడుమూరు పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్లు ఏర్పాటు చేయించిన కలెక్టర్!
Kodumur: కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులకు వీల్‌చైర్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారంటూ hmtv ప్రసారం చేసిన కథనానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి స్పందించారు.
స్వయంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ వృద్ధులు, దివ్యాంగుల ఇబ్బందులను గుర్తించి వెంటనే వీల్‌చైర్లను ఏర్పాటు చేయించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.




