Nandyal: మాదకద్రవ్యాల విక్రేతలపై ఉక్కుపాదం.. ఎస్పీ హెచ్చరిక

Nandyal: ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పిలుపు.

Shivraj, Karnool Town
Published on: 22 April 2026 11:20 AM IST
Nandyal: మాదకద్రవ్యాల విక్రేతలపై ఉక్కుపాదం.. ఎస్పీ హెచ్చరిక
X

Nandyal: మాదకద్రవ్యాల విక్రేతలపై ఉక్కుపాదం.. ఎస్పీ హెచ్చరిక

Nandyal: ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పిలుపునిచ్చారు. నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో మాదక ద్రవ్యాల నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారకుండా కాపాడటం అత్యంత అవసరమన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు మరియు సామాజిక దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ, వారు చెడు అలవాట్లకు లోనుకాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డ్రగ్స్ సమస్య సమాజం మొత్తం బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మద్యం, ధూమపానం, అధిక మొబైల్ వినియోగం వంటి వ్యసనాలనూ నివారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థలు తమ పరిధిలో ఇలాంటి కార్యకలాపాలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ కోరారు.

Shivraj, Karnool Town

Shivraj, Karnool Town

Next Story