Nandyal: తప్పులు లేని ఓటరు జాబితానే లక్ష్యం: నంద్యాల జిల్లా కలెక్టర్!
Nandyal: నందవరం పరిధిలోని పోలింగ్ బూత్‌ల బిఎల్ఓలతో ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. తప్పులు లేని ఓటరు జాబితాను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు.
Nandyal: తప్పులు లేని ఓటరు జాబితానే లక్ష్యం: నంద్యాల జిల్లా కలెక్టర్!
నంద్యాల: జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బి ఎల్ వో లకు సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నందవరం 1,2, సచివాలయాల పరిధిలోని 188, 189, 190, 191 పోలింగ్ బూతులకు సంబంధించిన బిఎల్వోలకు (SIR) ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పురోగతిపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సీ రివిజన్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
ఎస్ ఐ ఆర్ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్న వెంటనే సంబంధిత పై అధికారులకు తెలియజేసి సమస్య పరిష్కరించుకోవాలన్నారు.
బిఎల్ఓ లు ఓటర్ల నుంచి ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేసి తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసి ఆన్లైన్లో ఎక్కించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా పూర్తి చేయాలి అనే అంశాలకు సంబంధించి సెల్ ఫోన్ ద్వారా బిఎల్ఓ లకు వివరించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్, సచివాలయ సిబ్బంది, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు




