Kurnool: సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ లుగా అభివృద్ధి చేయాలి
Kurnool: కర్నూలు జిల్లాలోని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ హాస్టళ్లను నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ లుగా మార్చాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Kurnool: సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ లుగా అభివృద్ధి చేయాలి
Kurnool: జిల్లాలోని అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ వసతి గృహాల్లో, ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టళ్లను “నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ (NZHC)”లుగా అభివృద్ధి చేయడానికి సమగ్ర చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టళ్లలో నెట్ జీరో మరియు హెల్తీ క్యాంపస్ లుగా రూపొందించే అంశంపై సంక్షేమ శాఖలు, విద్యుత్, నెడ్ క్యాప్ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల్లో మెరుగైన చర్యలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చర్యల ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణ, నీటి సంరక్షణ (సస్టైనబిలిటీ) మరియు కార్బన్ ఉద్గారాల తగ్గింపును లక్ష్యంగా పెట్టుకోవాలి అని ఆదేశించారు.
నెట్ జీరో వ్యర్థాలు (Net Zero Waste) ప్రతి వసతి గృహంలో వంటగది వ్యర్థాలను వినియోగించి కిచెన్ గార్డెన్ల అభివృద్ధి కోసం వెజిటబుల్ డీకంపోజింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని తడి/సేంద్రీయ మరియు పొడి/రీసైకిల్ వ్యర్థాల వర్గీకరణ వ్యవస్థను అమలు చేసి సమర్థవంతమైన రీసైక్లింగ్‌ను సాధించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. గ్రీన్ వాటర్ (Green Water) వర్షపు నీటి సంరక్షణ (Rainwater Harvesting) వ్యవస్థలను ఏర్పాటు చేసి భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలి.
సోక్ పిట్స్ ద్వారా ఉపయోగించిన నీటిని తిరిగి వినియోగించే చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి నాణ్యత & పరిశుభ్రత RO వ్యవస్థల ద్వారా తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, నీటి నమూనాలను పరీక్షించాలి. ఆర్వో ప్లాంట్లను పటిష్టంగా నిర్వహించడానికి గాను వసతి గృహాల సిబ్బందికి తగు శిక్షణ ఇప్పించవలసిందిగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ మనోహర్ ను ఆదేశించారు.
నెట్ జీరో ఎనర్జీ చర్యల కొరకు సౌర రూఫ్‌టాప్‌లను PM-Surya Ghar పథకం, RESCO మోడల్ మరియు NREDCAP ద్వారా పనులు టెండర్ల దశలో ఉన్నయని వాటి ఏర్పాటు అనంతరం శుద్ధ ఇంధన వినియోగాన్ని పెంపొందించాలని తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లా లో 63 సంక్షేమ విద్యాసంస్థలను పర్యావరణహితము గా అఖీరా మియా వాకి ( జపాన్ ) పద్ధతి ద్వారా మొక్కల పెంపకం ద్వారా ఆరోగ్యకర క్యాంపస్‌లుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశానికి జిల్లా పరిషత్ సీఈవో వెంకటరమణారెడ్డి , కర్నూలు అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ , ఈడి సోషల్ వెల్ఫేర్ తులసీదేవి , డి డి బీసీ వెల్ఫేర్ ప్రసూన , డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ , జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ , ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ మనోహర్ నెడ్ కేప్ మేనేజర్ వీరేంద్ర , వసతి గృహాల కోఆర్డినేటర్ నిర్మల , ట్రాన్స్కో ఈ ఈ మనోహర్ రెడ్డి డి ఆర్ డి ఏ అడిషనల్ పీడీ అనిల్ కుమార్ మొదలగువారు పాల్గొన్నారు.




