Markapuram: ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు ప్రారంభం కలెక్టర్ సునీత!

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహన సేవలను కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 11 Aug 2026 1:39 PM IST
Markapuram
X

Markapuram: ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు ప్రారంభం కలెక్టర్ సునీత!

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహన సేవలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తల్లులు, నవజాత శిశువులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అనంతరం తల్లులు, శిశువులు సురక్షితంగా ఇళ్లకు చేరేందుకు ఈ వాహన సేవలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తల్లి–బిడ్డ ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story