Kurnool: ఓటర్ల జాబితా సవరణపై కమిషనర్ చల్లా ఓబులేసు సమీక్ష!
Kurnool: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.
Kurnool: ఓటర్ల జాబితా సవరణపై కమిషనర్ చల్లా ఓబులేసు సమీక్ష!
కర్నూలు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు స్వర్ణ వార్డు కార్యాలయాల ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు.గురువారం స్వర్ణ వార్డు కార్యాలయాల అడ్మిన్, ప్లానింగ్, అమినిటీస్, శానిటేషన్, వెల్ఫేర్, రెవెన్యూ, ఏఎన్‌ఎం కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అత్యల్ప పురోగతి ఉన్న బిఎల్వోలతో సమీక్ష నిర్వహించారు.
ఈఆర్వో చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు స్వర్ణ వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. బిఎల్వోలతో పాటు నాన్-బిఎల్వోలు సైతం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని కోరారు.
బిఎల్వోలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కోసం కార్యాలయాలకు వచ్చే ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడం, ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం, అవసరమైన సమాచారం అందించడం వంటి పనులను తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్ల జాబితా పరిశీలన, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి వాటిని డిజిటలైజ్ చేయడాన్ని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
టెలీకాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ ఈఆర్వోలు, అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, తహశీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, ఎన్నికల సూపరింటెండెంట్ సుబ్బన్న, సూపర్వైజర్లు, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.




