Nandyal: సుండిపెంటలో కమ్యూనిస్టు నేత బెదిరింపులు: ఆందోళనలో ఉద్యోగులు!
Nandyal: శ్రీశైలం మండలం సుండిపెంటలో కమ్యూనిస్టు నేత పేరుతో ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Nandyal: సుండిపెంటలో కమ్యూనిస్టు నేత బెదిరింపులు: ఆందోళనలో ఉద్యోగులు!
Nandyal: బెదిరింపులతో ఆ ఉద్యోగికి బీపీ ఎక్కువై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స..!
అమాయక చెంచు గిరిజనులను తప్పుడు రిజిస్ట్రేషన్తో ప్రకాశం, కర్నూలు,నంద్యాల జిల్లా అతను సొంత లాభాల కోసం గిరిజనులను తప్పు పట్టిస్తున్న వైనం..?
కొందరి అధికారుల నుంచి నెల మామూలు వసూళ్లు సేవ ముసుగులో ఎన్నో అక్రమాలు..?
పేరుకే ఎర్ర చొక్కా చేసే పనులన్నీ లోఫర్ పనులు అధికారంలో ఎవరు ఉంటే వారికి తొత్తుగా వ్యవహారం..?
ఇతనుపై చర్యలు తీసుకోవాలని బాధితులు కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకులను కోరుకుంటున్నారు..?
శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకుడు అని చెప్పుకుంటూ కొంతమంది ఉద్యోగులను చరవాణి ద్వారా ఫోన్ చేసి అతనికి ముడుపులు చెల్లించడం లేదని బెదిరింపులకు గురి చేయడమే కాకుండా వేదులుంపులకు పాల్పడుతున్నాడని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం ఇటీవల కాలంలో గిరిజన శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగుడిని వేధించడంతో ఆయనకు హైబీపీ వచ్చి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందినట్లు సమాచారం.? ఆయన పేరుకే కమ్యూనిస్టు పార్టీ ఏసుకుండేది ఎర్రచొక్కా ఇటీవల కాలంలో ఏ అధికార పార్టీ అధికారంలో ఉంటే ఆ చొక్కా ధరించి దంధాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆయన గారు ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాల సమీప గిరిజన గుడాల్లో ఆయనే గిరిజన నాయకుడు గౌరవ అధ్యక్షుడు అని చెప్పుకుంటూ రిజిస్ట్రేషన్ లేని సంఘాల లెటర్ ప్యాడ్లపై జిల్లా మండల అటవీ శాఖ అధికారుల చుట్టూ ప్రతిరోజు తిరుగుతూ చెంచు గిరిజనులను తప్పుదారి పట్టిస్తూ వారి నుంచి అక్రమంగా ఆకర్చు ఈ ఖర్చును చెప్పుకుంటూ వారి నుండి సొమ్ము వసూలు చేస్తూ దర్జాగా తిరుగుతున్న పట్టించుకునే నాధుడే లేడు అంతేకాకుండా సుండి పెంట గ్రామంలో ప్రభుత్వ గృహాన్ని కూడా కబ్జా చేసినట్లు ఆరోపణలు లేకపోలేదు ఇక మీదైనా కమ్యూనిస్టు పార్టీ సంబంధించిన నాయకులు మండల జిల్లా అధికారులు వెంటనే స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు




