Kurnool: కర్నూలులో రైతులకు పరిహార చెక్కులు పంపిణీ

Kurnool: కర్నూలు ఓర్వకల్లు మండలంలో APIIC భూములపై రైతులకు గౌరు చరిత రెడ్డి పరిహార చెక్కులు అందజేశారు.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 21 April 2026 12:01 PM IST
Kurnool
X

Kurnool

Kurnool: కర్నూలు జిల్లాలో రైతులకు పరిహార చెక్కులు పంపిణీ చేశారు. ఓర్వకల్లు మండలం మీదివేముల, ఉప్పలపాడు గ్రామాలకు చెందిన రైతుల భూములు APIICకు వెళ్లిన నేపథ్యంలో వారికి పరిహారం అందజేశారు.

పాణ్యం ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో రైతులకు పరిహార చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ విద్యాసాగర్, టీడీపీ మండల అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, నన్నూరు సొసైటీ చైర్మన్ నాగేశ్వర రెడ్డి, అలాగే మీదివేముల, ఉప్పలపాడు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA

Next Story