Kurnool: దేవరగట్టు ఆలయ ఆదాయ వ్యయాలపై విచారణ జరిపించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు!

Kurnool: దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఆలయ ఆదాయ వ్యయాలు, బన్నీ ఉత్సవాల దుకాణాల ఫీజులపై సమగ్ర విచారణ జరిపించాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Bheemalinga, Aluru
Published on: 18 Oct 2026 4:44 PM IST
Kurnool
X

Kurnool: దేవరగట్టు ఆలయ ఆదాయ వ్యయాలపై విచారణ జరిపించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు!

కర్నూలు: కర్నూలు జిల్లా హొలగుoద మండలంలో పరిధిలో ఉన్న దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఆలయానికి హుండీ ద్వారా వస్తున్న ఆదాయం, బన్నీ ఉత్సవాల సమయంలో దుకాణాల నుంచి వసూలు చేస్తున్న ఫీజులపై సమగ్ర విచారణ జరిపి, ఆదాయ వ్యయాల వివరాలను బహిరంగపరచాలని జై భారత్ మాతా సేవా సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు పోలిన సుబ్బారావు దొర కర్నూలు జిల్లా కలెక్టర్‌ డాక్టర్ ఏ సిరికు ఫిర్యాదు చేశారు. 2023, 2024, 2025 సంవత్సరాల ఉత్సవాల ఆదాయంతో పాటు ఏడాది పొడవునా వచ్చే హుండీ ఆదాయం, దుకాణాల అద్దెలు, ఫీజుల వసూళ్లు, ఖర్చులు, ఆడిట్ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఆలయ నిర్వహణ కమిటీ వివరాలు, దుకాణాల కేటాయింపులో పారదర్శకత, భక్తుల భద్రత, ప్రమాదాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోకపోతే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru