kurnool: పెంచికలపాడు వీధుల్లో ‘రెండేళ్ల నమ్మకం’ ప్రచారం..

kurnool: కర్నూలు జిల్లా పెంచికలపాడులో కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరాముడు కూటమి ప్రభుత్వ 'రెండేళ్ల నమ్మకం' ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 July 2026 9:50 PM IST
kurnool
X

kurnool: పెంచికలపాడు వీధుల్లో ‘రెండేళ్ల నమ్మకం’ ప్రచారం..

కర్నూలు: గూడూరు మండలం పెంచికలపాడు గ్రామం లో రెండేళ్ల నమ్మకం సంక్షేమం, అభివృద్ధి’ ఇంటింటి ప్రచారంలో భాగంగా గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో పాల్గొన్న రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరాముడు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, కోడుమూరు శాసన సభ్యులు బొగ్గుల దస్తగిరి,కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు మండల కన్వీనర్ జె. సురేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం -సంక్షేమం, అభివృద్ధి’ ఇంటింటి ప్రచార కార్యక్రమం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిదిలో ‘రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ సమాచార కరపత్రాలను ప్రతి ఒక్కరికీ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరాముడు గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోంది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.

ఈ కార్యక్రమంలో గూడూరు మండల టీడీపీ కన్వినర్ జె. సురేష్ ,ఎంపీటీసీ మద్దిలేటి, టీడీపీ సీనియర్ నాయకులు నాగేష్, కర్ణం చిన్న గిడ్డయ్య, తలారి బ్రహ్మయ్య,తెలుగుదేశం పార్టీ బూత్ ఇంచార్జ్ తిప్పన్న,యూనిట్ మరియు క్లస్టర్ ఇన్చార్జ్ బండారి యుగంధర్, శివ గిడ్డయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story