Kurnool: కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ నేత గిడ్డయ్య

Kurnool: వర్షాభావంతో కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి, ఎకరాకు ₹50 వేల పరిహారం ఇవ్వాలని సీపీఐ డిమాండ్. ఆగస్టు 18న ఛలో కలెక్టరేట్‌కు పిలుపు.

C. Ganesh, Kodumuru
Published on: 31 July 2026 12:43 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ నేత గిడ్డయ్య

కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

కర్నూలు జిల్లా కోడుమూరు సిపిఐ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మీడియా సమావేశం ఏర్పాటు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి ఆవేదనా వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలి డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల పరిహారం ఇవ్వాలి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు న్యాయం చేయాలి కోరారు.అంతేకాక రైతుల వ్యవసాయ రుణాలను తక్షణమే మాఫీ చేయాలి.కరువుపై ప్రజలను చైతన్య పరిచేందుకు 6వ తేదీ నుండి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేపడతామని తెలిపారు.రైతు సమస్యలపై ఆగస్టు 18న సిపిఐ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమం ఉంటుందన్నారు.కోడుమూరు తాగునీటి సమస్య పరిష్కరించకుంటే కోడుమూరు బంద్'కు హెచ్చరించారు.కర్నూలు జిల్లా లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి డిమాండ్ చేశారు.జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కోరారు.కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 20 కోట్లు కేటాయించాలి సిపిఐ కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లెనిన్ బాబు, సిపిఐ పార్టీ నాయకులు శేషు కుమార్,కృష్ణ,రాజు, రాముడు, విశ్వనాథ్ తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story