Kurnool: కర్నూలులో ఆర్టీసి బస్సుల పెంపు కోరుతూ సీపీఎం నిరసన!

Kurnool: కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 30 Sept 2026 6:53 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ఆర్టీసి బస్సుల పెంపు కోరుతూ సీపీఎం నిరసన!

Kurnool: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టిసి బస్సుల సంఖ్యను పెంచాలనీ సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని విద్యుత్ బస్సులు ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పరాదని ఆర్టీసీ బస్సులను ఇతర అవసరాలకు వాడుకో రాదని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతమని ఎందుకు ఈ ఉచిత బస్సులు పెట్టారో అర్థం కాని పరిస్థితిలో ప్రయాణికులు ఉంటున్నారని ఆయన తెలిపాడు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్యను పెంచితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అలా కాకుండా ఉన్న బస్సుల్లోనే ప్రయాణం చేయండి అని ఆలోచన ఉంటే ప్రజలు మీ సావులు మీరు చావండి అని చెప్పడమే తప్ప వేరేది కాదు అని ఆయన విమర్శించాడు ప్రధానంగా కర్నూలు జిల్లా కేంద్రం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సుల సౌకర్యం చాలా తక్కువగా ఉందని ఒక్కొక్క బస్సులో 100 మంది దాకా ప్రయాణం చేస్తున్నారని చిన్న పిల్లలతో వచ్చినవారు పసిపిల్లలు,తల్లులు ఊపిరి ఆడక చాలా అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపాడు.

డ్రైవర్లు కండక్టర్లు కూడా చాలా ఇబ్బందులకు లోనవుతున్నారని బస్టాండ్లకు వచ్చేముందే ఊర్లో బోర్డులు తీసేసుకుని వస్తున్నారని బోర్డులు ఉంటే ప్రజలు ఎగబడి ప్రయాణికులు దిగక ముందే ఎక్కేస్తున్నారని డ్రైవర్లు చెబుతున్నారని ఆయన తెలిపాడు. ఆర్టీసీ అధికారులు తీసుకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన విమర్శించారు. ప్రజలందరూ బస్సులు లేక ఇబ్బంది పడుతుంటే మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలు అంటూ ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన ఘాటుగా విమర్శించాడు. అలాగే కొత్తగా విద్యుత్తు బస్సులు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం సరైన పద్ధతి కాదని ఆర్టీసీ యాజమాన్యమే విద్యుత్ బస్సులు నడపాలని ఆయన డిమాండ్ చేశాడు.

ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు కర్నూల్ నుండి ఆదోని ఎమ్మిగనూరులో ఆలూరు డోను తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అదనకు బస్సుల సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమం దగ్గరికి ఆర్టీసీ రీజనల్ అధికారులకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు జెండా పడిపోయింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ, కె.వి నారాయణ, ఎండి ఆనంద్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు గురు శేఖర్ , నగేష్, అబ్దుల్లా నగర నాయకులు సాయిబాబా సుధాకర్ హుస్సేన్ భాష యేసు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL