Markapuram: వేములకోట సమీప రహదారిపై భారీ గుంత.. నిత్యం ప్రమాదాల ముప్పు!

Markapuram: మార్కాపురం–కుంట ప్రధాన రహదారిలో వేములకోట సమీపంలో ఏర్పడిన భారీ గుంత ప్రమాదాలకు నిలయంగా మారింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 6 July 2026 5:27 PM IST
Markapuram
X

Markapuram: వేములకోట సమీప రహదారిపై భారీ గుంత.. నిత్యం ప్రమాదాల ముప్పు!

Markapuram: ప్రమాదాలకు నిలయంగా మారిన వేములకోట సమీప రహదారి –

వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారుల విజ్ఞప్తి

మార్కాపురం జిల్లా మార్కాపురం నుంచి కుంటకు వెళ్లే ప్రధాన రహదారిలో వేములకోట గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఏర్పడిన భారీ గుంత గత రెండు నెలలుగా ప్రమాదాలకు కారణమవుతోంది. గుంత ఏర్పడి చాలా రోజులైనా సంబంధిత ఆర్&బి (రోడ్లు–భవనాల శాఖ) అధికారులు ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ రహదారిపై ప్రతిరోజూ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్రవాహనదారులకు రోడ్డు పక్కన ఉన్న గుంత కనిపించక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ,ప్రమాదాలు జరగకముందే స్పందించి, గుంతను వెంటనే పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, స్థానిక ప్రజలు ఆర్&బి అధికారులను కోరుతున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story