Devanakonda: ఎమ్మెల్యే విరూపాక్షి నిజాలు తెలుసుకో.. దేవనకొండ టీడీపీ నేతలు

Devanakonda: దేవనకొండ ఉపాధి హామీ కార్యాలయంలో జరిగిన ఘటనపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు.

G Jagadeesh, Pathikonda
Published on: 8 May 2026 5:58 PM IST
Devanakonda
X

Devanakonda: ఎమ్మెల్యే విరూపాక్షి నిజాలు తెలుసుకో.. దేవనకొండ టీడీపీ నేతలు

దేవనకొండ: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఉపాధి హామీ పథక కార్యాలయంలో జరిగిన నిజాలు తెలుసుకొని మాట్లాడాలని, దౌర్జన్యాలకు పాల్పడే నైజం మాది కాదని అది వైసిపి వారికే సాధ్యమని టిడిపి కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లేపల్లి రంగడు, టిడిపి సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ ఉచిరప్ప ఖండించారు.

స్థానిక టిడిపి పార్టీ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచాపురం ఫీల్డ్ అసిస్టెంట్ చిన్న గిడ్డయ్య పని దినాలు తక్కువ ఉన్నాయని ఉపాధి అధికారులు ఆయన స్థానంలో కురువ గిడ్డయ్యకు లాగిన్ ఇవ్వడం జరిగిందన్నారు. లాగిన్ ఇచ్చిన మరుసటిరోజే ఆయన జాబ్ కార్డు డిలీట్ చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై ఉపాధి కార్యాలయానికి వెళ్లి ఇన్చార్జి ఏపీఓ గంగన్న ను ప్రశ్నించగా తమకు ఏమీ తెలియదని చెప్పడంతో జాబ్ కార్డు ఎవరు తొలగించారో చెప్పాలని భీష్మించి కూర్చోవడం జరిగిందన్నారు.

దీంతో ఏపీవో గంగన్న కార్యాలయానికి తాళాలు అటెండర్ తో వేయించడం జరిగిందని అది తమపై ఎమ్మెల్యే బురద చల్లడం తగదన్నారు. ఆలూరు టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టం సారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. గత ప్రభుత్వంలోనే వైసిపి నాయకులు రౌడీయిజమునకు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వములో నాయకులు క్రమశిక్షణతో మెలిగి ఉంటారని గత రెండేళ్లుగా వైసీపీ మద్దతుదారుల ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.

టిడిపి ప్రభుత్వము,నాయకులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎమ్మెల్యే మానుకోవాలని సూచించారు.నిజాలు తెలుసుకోకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించడం ఎమ్మెల్యే స్థాయికి తగదన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో టిడిపి పార్టీ ఎంపీపీ,జడ్పిటిసి, సర్పంచులను అన్ని స్థానాల్లో గెలిపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో సహకార సొసైటీ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, మాజీ సర్పంచులు నాగరాజు గౌడ్, గిడ్డయ్య గౌడ్, వెలమకూరు భాస్కర్, టిడిపి నాయకులు మల్లయ్య, కాకర్ల శాంతి కుమార్ ,మల్లికార్జున గౌడ్, రమేష్ పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story