Giddalur: గిద్దలూరును కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఎం డిమాండ్
Giddalur: వర్షాల్లేక పంటలు ఎండిపోవడంతో గిద్దలూరును కరువు మండలంగా ప్రకటించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Giddalur: గిద్దలూరును కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఎం డిమాండ్
మార్కాపురం జిల్లా: గిద్దలూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ,తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం గిద్దలూరు ఎలక్షన్ డి టి ఇబ్రహీం ఖలీల్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు టి ఆవులయ్య మాట్లాడుతూ ఏలినో ప్రభావంతో గిద్దలూరు మండలంలో వర్షం తక్కువగా కురిసిందని అన్నారు.
జూన్ నెలలో కురిసిన కొద్దిపాటి వర్షానికి అరపదనుతో రైతాంగం నువ్వు , సజ్జ, మిరప, మొక్కజొన్న, కంది పంటలు వేయడం జరిగిందని జులై, ఆగస్టు నెలలో వర్షాలు లేకపోవడంతో వేసిన కొద్దిపాటి పంట సక్రమంగా పండకపోవడంతో రైతు పొలం దుక్కి దున్నడం తో రైతులు, కౌలు రైతులు ఆర్థికంగా నష్టపోయారని అన్నారు.
సకాలంలో వర్షాలు కొరకపోవడంతో మండలంలోని ఎక్కువ పొలం బీడు భూమిగా మారిందని అన్నారు. వ్యవసాయ పనులు లేక వ్యవసాయ కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న ధరలు తగ్గించాలని, రేషన్ షాప్ నుండి ఎనిమిది రకాల(బియ్యం, పంచదార, నూనె, చింతపండు, మిర్చి, ఉల్లిపాయలు, కందిపప్పు, గోధుమపిండి వంటివి) నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న గొర్రెలు, మేకలు, పశువుల పెంపకం దారులకు పశు గ్రాసం, దాన ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనిని రెండు వందల రోజులకు కల్పించాలని, రోజుకు కూలి 600 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో సిపిఎం పార్టీ నాయకులు బి నర్సింలు, డి తామస్, తదితరులు పాల్గొన్నారు.




