Yemmiganur: ఎమ్మిగనూరును కరువు ప్రాంతంగా ప్రకటించాలి: రాజీవ్ రెడ్డి
Yemmiganur: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించాలని, లేనిపక్షంలో నిరాహార దీక్షలు చేపడతామని వైసీపీ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి హెచ్చరించారు.
Yemmiganur: ఎమ్మిగనూరును కరువు ప్రాంతంగా ప్రకటించాలి: రాజీవ్ రెడ్డి
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వైసీపీ ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పలు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను ఎందుకు ప్రకటించలేదో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి రైతులకు సమాధానం చెప్పాలని అయన ప్రశ్నించారు.
కరువు మండలాల జాబితా విడుదలైనా ఎమ్మెల్యే ఎందుకు ఇంకా స్పందించడం లేదని ఎమ్మెల్యే నిద్రపోయాడా అంటూ ఆయన నిలదీశారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యాన్ని రైతులు గుర్తుపెట్టుకుంటన్నారు.
త్వరలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని, నియోజకవర్గం లోని మూడు మండలాలను మూడు రోజుల్లో కరవు మండలలుగా ప్రకటించాలని లేకుంటే కరువు మండలాలుగా ప్రకటించే వరకు రైతుల తరఫున దీక్షలు చేపడతామని రాజీవ్ రెడ్డి హెచ్చరించారు.




