Kurnool: మెడికల్ మాఫియా పంజా.. కూటమి ప్రభుత్వంపై ఏఐవైఎఫ్ ధ్వజం
Kurnool: ర్నూలు జిల్లాలో మెడికల్ మాఫియాను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ ఆరోపించింది.
Kurnool: మెడికల్ మాఫియా పంజా.. కూటమి ప్రభుత్వంపై ఏఐవైఎఫ్ ధ్వజం
కర్నూలు : కర్నూలు జిల్లాలో మెడికల్ మాఫియా ను నియంత్రణ చేయడం లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని కర్నూల్ లో ఏఐ వైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లాలో విచ్చలవిడిగా అనుమతి లేకుండా మెడికల్ షాపులతోపాటు ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల నుండి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని కార్పొరేట్ ఆసుపత్రిలో ఫీజుల దోపిడిని అరికట్టాలని లైసెన్స్ లేని మెడికల్ స్టోర్ ను తక్షణమే సిజ్ చేయాలని ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించి సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు డిమాండ్ చేశారు. వీటి సమస్యల పైన పరిష్కరించకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని సంతోష్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. హెచ్చరించారు.




