Atmakuru: విద్యార్థినులపై ప్రిన్సిపాల్, సిబ్బంది ఘోర వేధింపులు!
Atmakuru: కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రిన్సిపాల్, సిబ్బంది సాగిస్తున్న వేధింపులపై జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి విచారణ చేపట్టారు.
Atmakuru: విద్యార్థినులపై ప్రిన్సిపాల్, సిబ్బంది ఘోర వేధింపులు!
ఆత్మకూరు: బడుగు బలహీన సామాజిక వర్గాలకు విద్యను అందించే కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఆ మహిళా ప్రిన్సిపాల్ బయటికి కనిపించని ఓ హిట్లర్. తన కింది సిబ్బందిని కూడా తనలాగే మినీ లేడీ హిట్లర్లను తయారు చేసింది. విద్యార్థినిలను తన సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన సదరు ప్రిన్సిపల్ కీచకు రాలి అవతారం ఎత్తి మహిళా వాచ్ వుమన్ తో విద్యార్థినుల బట్టలు చింపించి చావగొత్తిస్తుంది. అందరితో ఊరుకున్నదా అనుకుంటే .. పురుగుల అన్నం, నీళ్ల చారు, అరకోర మాంసాహారం అంతంత మాత్రమే కంచాల్లో పడేస్తుంది.
ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, పత్రికల్లో రాయలేని భాషలో భూతు పురాణ ప్రవచనంతో రాత్రంతా వేధిస్తుంది. భరాయించరాని వేధింపులకు తట్టుకోలేక బాధిత విద్యార్థులు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇచ్చారు. దీంతో సదరు అధికారి, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి, తాసిల్దార్ విచారణ చేపట్టారు. ఈ సంఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ కొత్తపల్లి మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరిపై కృష్ణా భాయి అనే ప్రిన్సిపాల్ మోనార్క్ లా వ్యవహరిస్తుంది. నా కింది సిబ్బంది తాత్కాలిక నైట్ వాచ్ ఉమన్ తో చితక భావిస్తుంది. పురుగుల అన్నాన్ని వడ్డిస్తుంది. ఇదేమని ప్రశ్నించిన విద్యార్థినులను గదిలో బంధించి నైట్ వాచ్ వుమన్ తో ఒంటి మీద బట్టలు చిరిగిపోయేలా కొట్టిస్తుంది. ఈ వేధింపులను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించడానికి వస్తే హాస్టల్లోకి రానీయకుండా వారిని తిట్టి పంపిస్తుంది. హాస్టల్లో మహిళా ప్రిన్సిపల్, నైట్ వాచ్ ఉమెన్, వంట సిబ్బంది, మరికొందరు బోధన సిబ్బంది నిత్యం రాత్రి పూట విద్యార్థినులను వేధిస్తున్నారు.
ఈ సంఘటనపై నంద్యాల జిల్లా విద్యార్థిగారి జనార్దన్ రెడ్డి, జిల్లా గర్ల్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి జ్యోతి, కె. బి జి వి హాస్టల్లో తనిఖీ చేసి విద్యార్థులను విచారించారు. ప్రిన్సిపల్, నైట్ వాచ్ వుమన్, వంట వాళ్ల ఆగడాలు, వేధింపులను విద్యార్థులు డీఈఓ కు మరి పెట్టుకున్నారు. ఈ ప్రిన్సిపాల్ ను బదిలీ కానీ, సస్పెండ్ చేయాలని బాధిత విద్యార్థినిలు అధికారులతో ప్రాధేయపడ్డారు.
ఇదిలా ఉంటే , ఈ కే బి జి బి హాస్టల్ కు కొత్తవీట దూరంలో తహసిల్దార్ కార్యాలయం ఉన్నా.. ఈ సంఘటన తెలియకపోవటం విడ్డూరమని విద్యార్థినిల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులకు అందిన ప్రతి ఫిర్యాదు పై బహిరంగ విచారణ జరిపి నమోదు చేసిన నంద్యాల జిల్లా డీఈవో చివరిన.. విద్యార్థినిలకు తెల్ల కాగితాల చీటీలు ఇచ్చి ప్రిన్సిపల్ ఉండాలా?.. లేక వద్దా అని పేపర్ పై రాయమని విద్యార్థులను ప్రమాయించాడు. అప్పటికే ప్రిన్సిపల్ కు భయపడి పోయిన విద్యార్థినిలు కందరగోళ స్థితిలో ఉండిపోయారు.
ఆ తర్వాత తీరిగ్గా భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరమణయ్య రాగా .. తాళం తీయకుండా గేటు బయటనే జిల్లా అధికారిని సదరు ప్రిన్సిపల్ చాలాసేపు నిలబడేలా చేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన సదర అధికారి ఐదు నిమిషాలకే బయటకు వచ్చాడు.
ఇలా జిల్లా డీఈవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి, తాసిల్దార్ అందరూ కలిసి ప్రిన్సిపల్ పై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోకుండా తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు అరపిస్తున్నారు.
ఇదిలా ఉంటే కొత్తపల్లి కస్తూరిబా గాంధీ పాఠశాలలో జరిగిన సంఘటనలపై విచారణ చేశామని తప్పిదాలు జరిగితే చట్ట పరంగా చర్యలు తప్పవని మీడియాతో చెబుతూనే.. హాస్టల్ సిబ్బందిని వెనకేసుకొస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.




