Devanakonda: ఉత్తమ ఉపాధ్యాయుడు నబీ రసూల్, సీఆర్పీ షేక్ అన్నాకు ఘన సన్మానం!

Devanakonda: దేవనకొండ ఎఫ్‌ఆర్‌ హైస్కూల్‌లో గురుపూజోత్సవ సన్మానం. కర్నూలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు నబీ రసూల్, ఉత్తమ సీఆర్పీ షేక్ అన్నాను సత్కరించిన ఎంఈఓ ఉస్మాన్ భాష.

G Jagadeesh, Pathikonda
Published on: 8 Sept 2026 5:11 PM IST
Devanakonda
X

Devanakonda: ఉత్తమ ఉపాధ్యాయుడు నబీ రసూల్, సీఆర్పీ షేక్ అన్నాకు ఘన సన్మానం!

Devanakonda: గురుపూజోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన నబీ రసూల్‌తో పాటు మండల ఉత్తమ సీఆర్పీగా ఎంపికైన షేక్ అన్నాకు ఎఫ్‌ఆర్‌ హైస్కూల్‌ యాజమాన్యం ఘనంగా సన్మానం చేసింది. సెప్టెంబర్‌ 5న నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్న వారిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఎఫ్‌ఆర్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు బి. ఉచిరప్ప అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి ఉస్మాన్‌ భాష పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఉస్మాన్‌ భాష మాట్లాడుతూ.. నబీ రసూల్‌ తెర్నేకల్‌ జడ్పీ హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా సోషల్‌ సబ్జెక్టును బోధిస్తున్నారని తెలిపారు. సుదీర్ఘకాలంగా విద్యాబోధనలో కొనసాగుతూ ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచారని, ఆయన సేవలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.

అదేవిధంగా మండల సీఆర్పీగా పనిచేస్తున్న షేక్‌ అన్నా మండలంలోని పాఠశాలలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి ఎప్పటికప్పుడు మండల విద్యాధికారికి అందజేస్తూ అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఇలాంటి అంకితభావంతో పనిచేసే సిబ్బంది ఉండటం గర్వకారణమన్నారు.

సేవలను, పనితీరును పరిగణనలోకి తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ సిబ్బందిని ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్‌ రఘునాథ్‌, పాఠశాల ఉపాధ్యాయులు ఎస్‌ఎండీ భాష, స్రవంతి, లక్ష్మి, గోపాల్‌, సాహిదా, రంగస్వామి, షబానా, భవాని, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story