Devanakonda: ‘మీ రక్షణ - మా బాధ్యత’: మహిళల భద్రతపై దేవనకొండలో భారీ అవగాహన కార్యక్రమం!
Devanakonda: దేవనకొండలో మహిళల రక్షణే లక్ష్యంగా ‘మీ రక్షణ - మా బాధ్యత’ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వెంకటరామయ్య మహిళలకు చట్టాలు, శక్తి యాప్ మరియు అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు.
దేవనకొండ: దేవనకొండ మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ మరియు మహిళల భద్రతా చర్యలపై దేవనకొండ లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల పై నేరాల నివారణ కు అవగాహన కల్పించేందుకు మీ రక్షణ - మా భాధ్యత పేరుతో దేవనకొండ మండల కేంద్రంలోని PHCS ఫంక్షన్ హాల్ లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు DSP వెంకటరమయ్య తెలిపారు. ఈ సంధర్బంగా DSP మాట్లాడుతూ... మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిధ్ధంగా ఉంటారన్నారు. సమస్యల విషయం లో సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలకు పిలుపునిచ్చారు. చట్టాల పై అవగాహన పెరిగితే నేరాలు తగ్గుతాయన్నారు. మహిళలకు ఓటు హక్కు ఆస్తిలో సమాన భాగ హక్కులు ఇచ్చారన్నారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల చట్టం, నిర్భయ చట్టాలు ఉన్నాయన్నారు. పని ప్రదేశంలో, సమాజంలో ఎమైనా మహిళల పై అఘాయిత్యాలు జరిగినప్పుడు పోలీసు స్టేషన్ కి వచ్చి ఫిర్యాదులు చేయాలన్నారు.
ఎలాంటి భయాలు లేకుండా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదులు చేస్తనే చట్టాలు ఉపయోగపడతాయన్నారు. మహిళల భద్రత మనందరి భాధ్యత అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు శాఖ గట్టి చర్యలు చేపట్టిందన్నారు. పోలీసుస్టేషన్ కు రాకుండా మహిళల రక్షణ కవచం వంటి శక్తి యాప్ ఆధునిక సాంకేతిక సదుపాయాలను మహిళలు వినియోగించుకోవాలన్నారు.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా వెంటనే సహాయం పొందవచ్చని, మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర సహాయం కోసం డయల్ 112, 181, 1098, 1930 హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించాలన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ. మహిళలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆపద సమయంలో భయం వీడి పోలీసులను సంప్రదించాలని కోరారు. వేధింపులు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ మరియు ఇతర భద్రతా చర్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగినా, మహిళలకు సమస్యలున్నా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మహిళలు అత్యవసర సమయంలో శక్తి యాప్ వినియోగించాలన్నారు. సైబర్ నేరాల పై అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతి, టిడిపి మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, సీనియర్ నాయకులు ఉచిరప్ప, EX సర్పంచ్ బండిగింజల రంగన్న , మాజీ ఎంపీటీసీ ఆకుల వీరేష్, గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు, ఆశా వర్కర్క్ స్థానిక మహిళలు పాల్గొన్నారు.




