Devanakonda: అగ్నిప్రమాద బాధితులకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన టీడీపీ నేతలు!
Devanakonda: దేవనకొండలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధమై నిరాశ్రయులైన బోయ నాగరాజు కుటుంబానికి టీడీపీ నాయకులు రూ.50 వేల ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించారు.
Devanakonda: అగ్నిప్రమాద బాధితులకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన టీడీపీ నేతలు!
Devanakonda: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసె దగ్ధమై నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి టీడీపీ నాయకులు అండగా నిలిచారు. దేవనకొండ పట్టణంలోని బీసీ కాలనీలో బోయ నాగరాజుకు చెందిన గుడిసె బుధవారం సాయంత్రం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కుటుంబానికి చెందిన వస్తువులు కాలిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విషయం తెలుసుకున్న టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక, టీడీపీ సీనియర్ నాయకులు ఈదుల దేవరబండ సుభాన్, ఎంపీటీసీ ఆకుల వీరేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని నాయకులు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం, ఇతర సహాయ సహకారాలు అందేలా తమ వంతు కృషి చేస్తామని డాక్టర్ షేక్ సాధిక, ఈదుల దేవరబండ సుభాన్ హామీ ఇచ్చారు.
అదేవిధంగా వెంకట శివ సాయి ట్రేడర్స్ వేణు, శివ, నిర్వాహకులు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ, గుడిసె స్థానంలో రేకుల షెడ్డు నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందించి, నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగతంగా కూడా బాధిత కుటుంబానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
ఆపద సమయంలో తమకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన టీడీపీ నాయకులకు, వెంకట శివ సాయి ట్రేడర్స్ నిర్వాహకులకు నాగరాజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బండి గింజల రంగన్న, సిలివేరి రామాంజి, శ్రీరాములు, కుక్కల తిమ్మయ్య, చంద్ బాషా, రాజాసాహెబ్, రాజు, గోపాల్ గౌడ్, బాలకృష్ణ, మోదీన్, రమేష్, శ్రీను, మజీద్, సుభాన్, రాముడు, చిన్నప్పతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




