Devanakonda: బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ అంటూ వైసీపీ నాయకుల ధర్నా
Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ రామకృష్ణ (కిట్టు) ఆధ్వర్యంలో ‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ భారీ ధర్నా.
Devanakonda: బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ అంటూ వైసీపీ నాయకుల ధర్నా
దేవనకొండ: కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జడ్పిటిసి రామకృష్ణ (కిట్టు) కార్యకర్తలు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ “బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కిట్టు రామకృష్ణ, మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా హామీలకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
పెరుగుతున్న ధరలు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై ధర్నా నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మెడికల్ షాప్ శేఖర్, YCN అంజి, జుబేర్, జాకీర్, కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




