Markapuram: శ్రీశైలం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి డీజీపీఎస్ సర్వే!
Markapuram: శ్రీశైలం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల నుంచి సున్నిపెంట మీదుగా శ్రీశైలం వరకు 43 కి.మీ. డీజీపీఎస్ సర్వే చేపట్టనున్నారు.
Markapuram: శ్రీశైలం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి డీజీపీఎస్ సర్వే!
మార్కాపురం జిల్లా: శ్రీశైలం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పెద్ద దోర్నాల నుంచి సున్నిపెంట మీదుగా శ్రీశైలం వరకు డీజీపీఎస్ (DGPS) సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం ఐకానిక్ బ్రిడ్జి వరకు సుమారు 43 కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించనున్నట్లు సూపర్వైజర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈ సర్వే పెద్ద దోర్నాల నుంచి ప్రారంభమై బయోపార్క్, బైపాస్ మీదుగా సున్నిపెంటకు చేరుకుంటుందని ఆయన వివరించారు. అనంతరం సున్నిపెంటలోని డ్యామ్ సమీపం నుంచి శ్రీశైలం ఐకానిక్ బ్రిడ్జి వరకు సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భౌగోళిక వివరాలు, క్షేత్రస్థాయి కొలతల సేకరణలో భాగంగా ఈ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.




