Dhone: ఇంధన పొదుపుపై డోన్ ఎమ్మెల్యే వినూత్న ప్రచారం ఈవీ ఆటోలో ప్రయాణం
Dhone: నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఇంధన పొదుపుపై అవగాహన కోసం లద్దగిరి నుండి డోన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
Dhone: ఇంధన పొదుపుపై డోన్ ఎమ్మెల్యే వినూత్న ప్రచారం ఈవీ ఆటోలో ప్రయాణం
డోన్: నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వినూత్నంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. లద్దగిరి నుంచి డోన్ వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. నెలలో కనీసం ఒక వారం అయినా ఇంధన వినియోగాన్ని తగ్గించేలా ప్రజలు ప్రయత్నించాలని తెలిపారు. భవిష్యత్తులో ఇంధన సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు అవసరమన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఈవి ఆటోలో తన నివాసానికి చేరుకున్నారు.
Next Story




