Nandyal: డోన్ సాయి కాలనీలో 40 అడుగుల రోడ్డు స్థలం కబ్జా ఆరోపణలు!
Nandyal: డోన్ సాయి కాలనీలో 40 అడుగుల రోడ్డు స్థలం కబ్జాపై కాలనీవాసుల ఆందోళన. మున్సిపల్ అధికారులు స్పందించి స్థలాన్ని పునరుద్ధరించాలని డిమాండ్.
Nandyal: డోన్ సాయి కాలనీలో 40 అడుగుల రోడ్డు స్థలం కబ్జా ఆరోపణలు!
Nandyal: సాయిబాబా గుడి సమీపంలోని సాయి కాలనీలో 40 అడుగుల రోడ్డు స్థలం కబ్జాకు గురవుతోందని కాలనీవాసి అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 321లో మున్సిపల్ లేఅవుట్ ప్రకారం 40 అడుగుల రోడ్డు స్థలం ఉన్నప్పటికీ, కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గత ఐదు నెలలుగా అధికారులు పలుమార్లు వచ్చి స్థలాన్ని పరిశీలించినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.
సమస్యను పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు స్థలం కబ్జాకు గురైతే కాలనీవాసులకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి లేఅవుట్ ప్రకారం స్థలాన్ని స్వాధీనం చేసుకుని, 40 అడుగుల రోడ్డు మార్గాన్ని యథాస్థితిలో పునరుద్ధరించాలని అనిల్ కోరారు.




