Kurnool: క్యాన్సర్‌పై భయం వద్దు.. ముందస్తు గుర్తింపుతో సంపూర్ణ నివారణ

Kurnool: కర్నూలు శివసాయి పాలీక్లినిక్‌లో క్యాన్సర్ వ్యాధిపై ప్రముఖ డాక్టర్ రాజేష్ గౌడ్ (యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ) అవగాహన సదస్సు నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 5 Jun 2026 8:35 PM IST
Kurnool
X

Kurnool: క్యాన్సర్‌పై భయం వద్దు.. ముందస్తు గుర్తింపుతో సంపూర్ణ నివారణ

కర్నూలు: ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే క్యాన్సర్ వ్యాది ని పూర్తిగా నయం చేయవచ్చని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్. రాజేష్ గౌడ్ అన్నారు. కర్నూలు లోని శివసాయి పాలీక్లినిక్ లో క్యాన్సర్ వ్యాధిపై డాక్టర్. రాజేష్ గౌడ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో డాక్టర్. రాజేష్ గౌడ్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్స కు అదునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని దీంతో క్లిష్టమైన క్యాన్సర్ ఆపరేషన్లు సైతం ఒక్కరోజులో చేసేందుకు వీలుగా ఉందన్నారు.

అత్యంత ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణలో రోబోటిక్ శస్త్రచికిత్స మరియు ఫ్లోరోసెన్స్ గైడెన్ సర్జరీ ఈఆదునిక టెక్నాలజీ లతో షేషంట్ కు ఎంతో మేలు మేలు జరుగుతుందన్నారు. మహిళల క్యాన్సర్లలో ముఖ్యంగా గర్బాశయ మరియు అండాశయ క్యాన్సర్ లలో రోబోటిక్ శస్త్రచికిత్స మంచి ఫలితాలు ఇస్తుందని డాక్టర్. రాజేష్ గౌడ్ తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story