Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ బరిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక!

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఎంబీబీఎస్ వైద్యురాలు డాక్టర్ షేక్ సాధిక నామినేషన్ దాఖలు చేశారు. అభివృద్ధే లక్ష్యమని ప్రకటన.

G Jagadeesh, Pathikonda
Published on: 23 Oct 2026 6:33 AM IST
Devanakonda
X

Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ బరిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక!

Devanakonda: దేవనకొండ జడ్పీటీసీగా డాక్టర్ షేక్ సాధిక పోటీదేవనకొండ. మండల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ షేక్ సాధిక నామినేషన్ దాఖలు చేశారు. ఈదుల దేవరబండ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు సుభాన్‌తో కలిసి రిటర్నింగ్ అధికారి ఆర్. సుధాకర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఎంబీబీఎస్ పూర్తి చేసిన తాను వైద్య సేవలతో పాటు రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సాధిక తెలిపారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే మండలంలోని అన్ని గ్రామాల్లో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

తనకు అవకాశం కల్పించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda