Kurnool: ఎమ్మెల్యే విరూపాక్షిపై జగన్ చర్యలు తీసుకోవాలి జయనాగేశ్వర రెడ్డి!

Kurnool: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌పై స్పందించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి. దాడులు చేస్తే వైఎస్సార్‌సీపీకి వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని హెచ్చరిక.

S Khaleel, Yemmiganur
Published on: 3 Aug 2026 3:28 PM IST
Kurnool
X

Kurnool: ఎమ్మెల్యే విరూపాక్షిపై జగన్ చర్యలు తీసుకోవాలి జయనాగేశ్వర రెడ్డి!

కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విరూపాక్షి పై జగన్ చర్యలు తీసుకుని బుద్ధి చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన... ఎలాంటి ఘనకార్యం చేశాడని వైసీపీ ని ప్రశ్నించారు.

అతనో స్వాతంత్ర్య సమరయోధుడిలా చూపిస్తూ వైసీపీ డ్రామాలు చేస్తోందని ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు. ప్రజలపై ఎదురుదాడులు చేస్తే వచ్చే ఎన్నికల్లో ఏసుప్రభు సాక్షిగా చెబుతున్నా వైసీపీకి 11 సీట్లు కూడా రావని జయనాగేశ్వర రెడ్డి హెచ్చరించారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story