Kurnool: ఎమ్మిగనూరులో వైకాపాకు షాక్.. పచ్చ కండువా కప్పుకున్న 500 మంది

Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమక్షంలో వైసీపీకి చెందిన 500 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 3 May 2026 6:24 PM IST
Kurnool
X

Kurnool: ఎమ్మిగనూరులో వైకాపాకు షాక్.. పచ్చ కండువా కప్పుకున్న 500 మంది

Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గంజహళ్లి మరియు నందవరం మండలం మిట్టసోమపురం గ్రామాలకు చెందిన 17, 249, 250, 251 బూత్‌ల పరిధిలోని సుమారు 500 మంది వైఎస్సార్‌సీపీ మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి మరియు ఫోకస్ బూత్స్ అబ్సర్వర్ పోతురాజు రవికుమార్ గార్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే గారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సభ్యులు పోతురాజు రవికుమార్, ఏఎంసీ చైర్మన్, మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story